ఉద్యోగాలపై ప్రభుత్వం ఒట్టి మాటలే

ఉద్యోగాలపై ప్రభుత్వం ఒట్టి మాటలే

హైదరాబాద్: ఉద్యోగాలపై ప్రభుత్వం ఒట్టి మాటలు తప్ప చేసేదేం లేదన్నారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. ఎన్నికలు వచ్చినపుడే ముఖ్యమంత్రికి ఉద్యోగాలు గుర్తొస్తాయని విమర్శించారు. నిరుద్యోగులను ఊరిస్తూ ప్రకటనలు చేయటం.. ఆ తర్వాత పట్టించుకోకపోవటం కేసీఆర్ కు అలవాటేనన్నారు. సీఎం చెప్పిన 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగాల విషయంలో సర్కార్ తప్పుడు లెక్కలు చెబుతూ మభ్యపెడుతోందన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు కోదండరాం.