
లింగంపేట, వెలుగు: మండలంలోని రామాయిపల్లి తండాకు చెందిన దేవసోత్ వనిత బుధవారం 108లో ప్రసవించింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న వనితను కుటుంబ సభ్యులు లింగంపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడి డాక్టర్లు ఆమెను కామారెడ్డి ఏరియా హాస్పిటట్‌కు రెఫర్ చేయడంతో 108లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మగబిడ్డకు జన్మనిచ్చినట్లు అంబులెన్సు ఫైలట్ సంగాగౌడ్, ఈఎంటీ అరవింద్ చెప్పారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య చికిత్సల కోసం కామారెడ్డి లోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్‌లో చేర్పించినట్లు వారు తెలిపారు.