మోడల్ అంగన్వాడీ  కేంద్రాలు ఏర్పాటు చేయాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

మోడల్ అంగన్వాడీ  కేంద్రాలు ఏర్పాటు చేయాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు:  జిల్లాలో మోడల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.  మంగళవారం కలెక్టర్  కార్యాలయంలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల శాఖ పై సమీక్ష  సమావేశం  నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ..  అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు బరువు పరిశీలించి పోషకలోపం ఉన్న పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేసి పోషన్ ట్రాకర్ ద్వారా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కే.నరసింహరావు,  సూపరింటెండెంట్  జి.హుస్సేన్, డీసీపీవో రవి కుమార్, ఏఫ్ ఆర్వో  బి.వినోద్ కుమార్, సంకల్ప జిల్లా కోఆర్డినేటర్ చైతన్య పాల్గొన్నారు.