జేఈఈ మెయిన్స్ రెజోనెన్స్ విజయకేతనం 

జేఈఈ మెయిన్స్ రెజోనెన్స్ విజయకేతనం 

వరంగల్‍, వెలుగు: నేషనల్‍ టెస్టింగ్‍ ఏజెన్సీ తాజాగా ప్రకటించిన జేఈఈ మెయిన్‍ 2026 సెషన్‍_1 ఫలితాల్లో రెజోనెన్స్ వరంగల్‍ బ్రాంచ్‍కు చెందిన 13 మంది విద్యార్థులు 99 కంటే ఎక్కువ పర్సంటైల్‍, 69 మంది 95 పర్సంటైల్‍, 141 మంది స్టూడెంట్లు 90 పర్సంటైల్‍తో సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా మంగళవారం హనుమకొండ కాలేజీలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభలో చైర్మన్‍ లెక్కల రాజిరెడ్డి పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.

అనంతరం మాట్లాడారు. వరంగల్‍ రెజోనెన్స్​విద్యార్థులైన బి.సాకేత్‍రెడ్డి 99.93 పర్సంటైల్‍ (260310653522), ఎన్‍.నాగచైతన్య 99.78 (260310339623), పి.కార్తీకేయ 99.76 (260310124476), ఎ.రితిక 99.73 (260310041885), ఎం.సాయికౌషిక్‍ 99.70 (260310386378), జె.హర్షిత్‍ 99.68 (260310757255), వై.సాత్విక 99.65 (260310124456), ఎండీ.అషార్‍ ఇక్భాల్‍ 99.36 (260310405614), ఆర్‍.జయంత్‍ 99.34 (260310262227), సీహెచ్‍.సాయివర్షిత్‍ 99.21 (260310128622), జి.వర్థిని 99.18 (260310129007), ఎన్‍.ఆకర్ష్​ 99.15 (260310009384), ఎం.సాత్విక్‍రెడ్డి 99.02 పర్సంటైల్‍ (260310791306) సాధించారు.  వీరేగాక జేఈఈ అడ్వాన్స్​ పరీక్ష అర్హత సాధించడానికి అవసరమైన పర్సంటైల్తో పాటు ప్రతిష్టాత్మక ఎన్‍ఐటీల్లో సీట్లు పొందడానికి కావాల్సిన పర్సంటైల్‍ సాధించినట్లు రాజిరెడ్డి తెలిపారు. అభినందన సభలో కాలేజీ యాజమాన్యం, సిబ్బంది  విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సత్కరించారు. సమావేశంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్‍రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‍రెడ్డి, సీఏవో లెక్కల రమ్య రాజిరెడ్డి, అడమిక్‍ డీన్‍ బీఎస్‍.గోపాల్‍రావు తదితరులు పాల్గొన్నారు.