సదాశివనగర్, వెలుగు : మహిళల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తుందని, అనే పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఐకేపీ ఏపీఎం ప్రసాద్ అన్నారు. మంగళవారం మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సభ్యురాలు నంశగారి మమతకు రూ. 2 లక్షల రుణంతో గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల మహిళలను లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో ఈ పథకం కింద గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ పయ్యావుల గంగాధర్, వార్డు సభ్యులు శేకెల్లి రేఖారంజిత్ కుమార్, సీసీలు అంజాగౌడ్, ధర్ని ఆంజనేయులు, భూమయ్య, నరేందర్ రెడ్డి, వీవో అధ్యక్షులు అనురాధ, స్వరూప, తల, లలిత, వీవోఏలు ఆస గంగామణి తదితరులు పాల్గొన్నారు.
