జేఈఈ మెయిన్స్ లో ‘వైబ్రంట్’ విజయదుందుభి 

జేఈఈ మెయిన్స్ లో ‘వైబ్రంట్’ విజయదుందుభి 

హనుమకొండ సిటీ, వెలుగు: జేఈఈ మెయిన్స్ సెషన్ ఫలితాల్లో హనుమకొండ వైబ్రంట్ అకాడమీ విజయదుందుభి మోగించింది. సోమవారం విడుదలైన ఫలితాల్లో వైబ్రంట్ విద్యార్థులు సచ్ కల్స 99.99 పర్సంటైల్, డీ.హేమంత్ 99.24 పర్సంటైల్ సాధించారు. వీరితోపాటు పెద్దపల్లి చరణ్ తేజ 96.81 పర్సంటైల్, కొండమల్ల రామ్​చరణ్ 94.94 పర్సంటైల్, సోలేంక సిద్ధార్థ 94.35 పర్సంటైల్, జ్ఞానశ్రీ 93.46 పర్సంటైల్, వెల్దండి సాయిచంద్ర 92.25 పర్సంటైల్ మరియు 48 మంది విద్యార్థులకు 90.00 పర్సంటైల్ పైగా సాధించగా వారిని మంగళవారం అకాడమీ డైరెక్టర్ చిట్టేటి రాజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ శేషుకుమార్ అభినందించారు.

ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కోటా రాజస్థాన్ విద్యాసంస్థ అయిన వైబ్రంట్ అకాడమీ వరంగల్ నగరంలో స్థాపించి కోటా ఫ్యాకల్టీ, డైరెక్టర్స్ పర్యవేక్షణలో తయారుచేసిన స్టడీ మెటీరియల్, మైక్రో షెడ్యూల్స్ తో ప్రాక్టీస్ పేపర్స్ రూపొందించినట్లు తెలిపారు. కోటా ఫ్యాకల్టీస్ తో ప్రతి సబ్జెక్టుపై సందేహాల నివృత్తికి స్పెషల్ క్లాసులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రెగ్యూలర్గా వీకెండ్ ఎగ్జామ్స్, మెయిన్స్, అడ్వాన్స్డ్ నిర్వహించడం, ఎక్కడా లేని విధంగా యోగా, మెడిటేషన్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. దీంతో రెండేండ్ల క్లాస్ రూం టీచింగ్ తో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు వివరించారు.