కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్

V6 Velugu Posted on May 05, 2021

హైదరాబాద్​, వెలుగు: సీఎం కేసీఆర్ ​కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఫామ్​హౌస్​లో ఐసోలేషన్​లో ఉంటున్న ఆయనకు ఎంవీ రావు ఆధ్వర్యంలోని డాక్టర్ల టీం మంగళవారం టెస్టులు నిర్వహించింది. ర్యాపిడ్​ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసీఆర్  టెస్టులోనూ నెగెటివ్​ రిపోర్టులు వచ్చాయి. రక్త పరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నాయని తేలింది. దీంతో సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు డాక్టర్లు చెప్పారు.  

సీఎంఓ ప్రకటన
తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయనకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఏప్రిల్‌ 19న కేసీఆర్‌ కరోనా బారినపడిన కొన్ని రోజుల హోం ఐసోలేషన్‌ తర్వాత యాంటీజన్‌ పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌ వచ్చింది. కానీ, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలిందని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు ప్రకటించారు.దీంతో ఆయన ఐసోలేషన్‌ను కొనసాగించారు. నేడు మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా నెగటివ్‌గా తేలింది.

Tagged CM KCR, corona effect, , kcr health bulleting, kcr health status, kcr treatment, recovered from corona, kcr covid

Latest Videos

Subscribe Now

More News