ఆగిపోయిన పాలసీల.. పునరుద్ధరణకు చాన్స్.. ప్రకటించిన LIC

ఆగిపోయిన పాలసీల.. పునరుద్ధరణకు చాన్స్.. ప్రకటించిన LIC

హైదరాబాద్, వెలుగు: నిలిచిపోయిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి ఎల్ఎసీ ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టింది. ఈ అవకాశం ఈ ఏడాది మార్చి రెండో తేదీ వరకు ఉంటుంది. వ్యక్తిగత పాలసీల లేట్ ఫీజుపై 30 శాతం వరకు.. అంటే గరిష్టంగా రూ.ఐదు వేల రాయితీ లభిస్తుంది.

రూ.లక్ష లోపు ప్రీమియంపై రూ.మూడు వేలు, రూ. లక్ష నుంచి రూ.మూడు లక్షల వరకు రూ నాలుగు వేలు, రూ.మూడు లక్షల పైన ఉన్న వాటికి రూ.ఐదు వేల వరకు చార్జీ తగ్గుతుంది. మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్లకు 100 శాతం రాయితీ ఉంటుందని ఎల్ ఐసీ తెలిపింది.