ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో మూడు వీడీసీలపై కేసు : డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో మూడు  వీడీసీలపై కేసు :  డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా తలమడుగు మండలంలోని మూడు వీడీసీలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్​రెడ్డి తెలిపారు. కుచులాపూర్  గ్రామంలో బెల్ట్ షాప్​ వేలం వేసి రూ.4.6 లక్షలకు గాను రూ.30 వేలు వసూలు చేశారు. మిగిలిన డబ్బుల కోసం బెదిరించగా బెల్ట్  షాప్​ ఓనర్​ ఫిర్యాదు మేరకు ఎన్.శ్రీనివాస్, దారట్ల జనార్ధన్ ను అరెస్ట్​ చేయగా, గంగారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. 

సాయిలింగిలో బెల్ట్ షాపు నిర్వాహకుడిని రూ.1.6 లక్షలు అడగగా ముగ్గురిపై కేసు నమోదు చేశామని, పల్లి(బి)లో ఆలయ నిర్మాణం కోసం బెల్టు షాపు కోసం వేలం నిర్వహించి రూ.1.20 లక్షలు వసూలు చేశారు. మిగిలిన రూ.1.20 లక్షలు ఇవ్వాలని బెదిరించగా, బాధితుడు ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.