వరంగల్ సిటీ, వెలుగు: మేడారం మహా జాతర లో భక్తులకు వైద్య సేవలపై స్పెషలిస్ట్ డాక్టర్లతో శుక్రవారం ఎంజీఎంలో సమావేశం జరిగింది. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్హరీశ్చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్తలు పాల్గొన్నారు.
జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన నాణ్యతతో కూడిన వైద్యసేవలను ,స్పెషలిస్ట్ డాక్టర్లతో అందించాలని నిర్ణయించారు. ములుగు, నర్సంపేట, భూపాలపల్లి మెడికల్ కాలేజీలతో పాటు అన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లోని స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సేవలను డిప్యూటేషన్ పై తీసుకోవాలని స్పష్టంచేశారు. ఉమ్మడి జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని వైద్యాధికారులను, సూపర్ వైజర్లను, స్టాఫ్ నర్స్ లను, ఆరోగ్య కార్యకర్తల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.
జాతరలో ఫస్ట్ రెఫరల్ సెంటర్ గా 50 బెడ్లతో పాటు ములుగు ఆస్పత్రిలో సెకండరీ లెవల్ వైద్య సేవలకు 20 బెడ్లతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్డాక్టర్ హరీశ్చంద్రా రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ అప్పయ్య, డాక్టర్ గోపాల్ రావు ,డాక్టర్లు మధుసూదన్, అధికారులు పాల్గొన్నారు.
