నెమ్మదించిన తయారీ రంగం రెండేళ్ల కనిష్టానికి పతనం

నెమ్మదించిన తయారీ రంగం రెండేళ్ల కనిష్టానికి పతనం

న్యూఢిల్లీ: మన దేశ తయారీ రంగం కార్యకలాపాలు డిసెంబరులో రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. కొత్త ఆర్డర్ల వృద్ధి నెమ్మదించడంతో హెచ్ఎస్బీసీ ఇండియా మానుఫ్యాక్చరింగ్ పీఎంఐ నవంబర్లో ఉన్న 56.6 నుంచి డిసెంబర్లో 55కు తగ్గింది. పీఎంఐ సూచీ 50 పైన ఉంటే వృద్ధిని, 50 కంటే తక్కువ ఉంటే తగ్గుదలను సూచిస్తుంది. అంతర్జాతీయ ఆర్డర్లు కూడా నెమ్మదిగా పెరిగాయి.

కొత్త ఎగుమతి ఆర్థ ర్లు గత 14 నెలల్లో అతి తక్కువగా నమోదయ్యాయి. దీనివల్ల కంపెనీలు తమ కొనుగో ళ్లను, కొత్త ఉద్యోగాల కల్పనను పరిమితం చేశాయి. మార్చి 2024 నుంచి చూస్తే ఉద్యోగాల కల్పన వేగం ఈ నెలలో చాలా తక్కువగా ఉంది.