- రూ.2.58 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్) కింద ప్రభుత్వం 22 కొత్త ప్రతిపాదన లకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రూ.41,863 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల రూ.2,58,152 కోట్ల విలువైన ఉత్పత్తి జరుగుతుంద ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. డిక్సన్, శామ్సంగ్ డిస్ప్లే నోయిడా, ఫాక్స్కన్, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి సంస్థల ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 33,791 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.
ఆంధ్రప్రదేశ్ , హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళ నాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రా జెక్టులు విస్తరించి ఉన్నాయి. పీసీబీలు, కెపాసిటర్లు. కనెక్టర్లు, లిథియం అయాన్ సెల్స్ వంటి 11 రకాల ఉత్పత్తులను వీటిలో తయారు చేస్తారు.
