ఒక్కటైన KFC, పిజ్జా హట్.. కొత్తగా భారీ రెస్టారెంట్ చెయిన్

ఒక్కటైన KFC, పిజ్జా హట్.. కొత్తగా భారీ రెస్టారెంట్ చెయిన్

న్యూఢిల్లీ: సఫైర్ ఫుడ్స్ ఇండియా, దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ (డీఐఎల్) విలీనానికి సిద్ధమయ్యాయి. దీనివల్ల మూడు వేలకు పైగా ఔట్ లెట్లతో భారీ ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్ చెయిన్ ఏర్పడనుంది. 

కేఎఫ్సీ, పిజ్జా హట్ బ్రాండ్లను నిర్వహిస్తున్న ఈ రెండు సంస్థల విలీనానికి బోర్డులు ఆమోదం తెలిపాయి. వీటి ఉమ్మడి టర్నోవర్ దాదాపు రూ. ఎనిమిది వేల కోట్లు ఉంటుంది. ఈ విలీనం తర్వాత భారత్. నైజీరియా, నేపాల్, థాయిలాండ్, శ్రీలంకలో కార్యకలాపాలు కొనసాగుతాయి.