బాలలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

బాలలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

హైదరాబాద్, వెలుగు: నేటి బాలలే రేపటి పౌరులన్న నెహ్రూ స్ఫూర్తితో పాఠశాల విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చదువుతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని, విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చేశారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి(శుక్రవారం)ని పురస్కరించుకుని జరుపుకునే.. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని బాలబాలికలందరికీ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

 “బాలలను జాతి సంపదగా భావించి వారి మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేయాలన్న నెహ్రూ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోంది. విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలి" అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.