
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని తొమ్మిది మంది కవులు రాష్ట్రానికి అందించిన విశేష సేవలకు గానూ.. ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదుతో పాటు.. ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం, తామ్ర పత్రాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తొమ్మిది మంది కవులు వీళ్లే...
- అందెశ్రీ
- పాశం యాదగిరి
- గద్దర్
- గోరేటి వెంకన్న
- బండి యాదగిరి
- సుద్దాల అశోక్ తేజ
- జయరాజ్
- గూడ అంజయ్య
- ఎక్కా యాదగిరి రావు