వన్డే సిరీస్ నుంచి రోహిత్, కుల్దీప్ సేన్, దీపక్ చాహర్ ఔట్

వన్డే సిరీస్ నుంచి రోహిత్, కుల్దీప్ సేన్, దీపక్ చాహర్ ఔట్

వన్డే సిరీస్ కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న టీమిండియా మరో దెబ్బ. బంగ్లాతో జరిగే చివరి వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ రోహిత్ శర్మ ...మెరుగైన చికిత్స కోసం ముంబైకు వెళ్లనున్నాడు. ఈ మేరకు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపాడు. చికిత్స అనంతరం రోహిత్ శర్మ బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తాడని చెప్పాడు. అటు టెస్టు సిరీస్‌కు కూడా రోహిత్  అందుబాటులో ఉంటాడా లేదా అన్నది కూడా ఇప్పుడే చెప్పలేమని ద్రావిడ్ తెలిపాడు. రోహిత్ శర్మతో పాటు..వన్డే సిరీస్ నుంచి కుల్దిప్ సేన్, దీపక్ చాహర్ కూడా వైదొలిగారు. వీరిద్దరు కూడా మూడో వన్డేలో ఆడటం లేదని రాహుల్ ద్రావిడ్ వెల్లడించారు. 

రోహిత్ పోరాట పటిమ...

సెకండ్  మ్యాచ్ లో రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. స్కానింగ్ చేయగా..అతని బొటన వేలు డిస్‌లొకేట్ అయినట్లు తేలింది. దీంతో కుట్లు వేసిన డాక్టర్లు.. నొప్పి తగ్గేందుకు  ఇంజెక్షన్లు ఇచ్చారు. కుట్లు పడటంతో బ్యాటింగ్ దిగొద్దని వైద్యులు సూచించినా...బరిలోకి దిగిన రోహిత్ టీమిండియాను గెలిపించే ప్రయత్నం చేశాడు. 28 బంతుల్లో 51 పరుగులు చేసి..చివరి వరకూ పోరాడాడు.