భూభారతి చట్టం ప్రకారమే సర్వే చేయాలి : ఆశిష్ ​సాంగ్వాన్

 భూభారతి చట్టం ప్రకారమే సర్వే చేయాలి : ఆశిష్ ​సాంగ్వాన్
  • కలెక్టర్ ఆశిష్ ​సాంగ్వాన్

లింగంపేట, వెలుగు: భూభారతి చట్టం ప్రకారమే భూ సర్వే చేయాలని కలెక్టర్ ఆశిష్​సాంగ్వాన్​ఆదేశించారు.  శనివారం లింగంపేట మండలం కన్నాపూర్​శివారులో భూభారతి టీంలు చేపడుతున్న సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సర్వే నంబర్ 240లో ఉన్న భూములను, పాసుపుస్తకాల కోసం రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించారు. ఎన్నేళ్లుగా సాగు చేస్తున్నారు? భూ విస్తీర్ణం ఎంత? ఎంతమంది రైతులున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 అటవీ ప్రాంతమా? పట్టా భూములా తేల్చేందుకు అటవీ, రెవెన్యూ శాఖల ఆఫీసర్లు సంయుక్తంగా సర్వే నిర్వహించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు లేకపోతే పట్టాలకు సిఫారసు చేయాలని చెప్పారు. అనంతరం పర్మల్ల రైతు వేదికలో రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాన్సువాడ సబ్​కలెక్టర్​ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ తదితరులున్నారు. మండుటెండలో కలెక్టర్ కాలినడకన  భూ సర్వే పరిశీలనకు రావడంపై కన్నాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం జేశారు.