
కామారెడ్డి, వెలుగు : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ డాక్టర్లకు సూచించారు. గురువారం కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వయిజరీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. అంతకు ముందు కలెక్టర్ హాస్పిటల్‌లోని ఆయా విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ అంశాలపై చర్చించారు. పేషెంట్ల రిజిస్ర్టేషన్ కోసం షెడ్డు నిర్మాణంతో పాటు, తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆరోగ్య శ్రీ ఫండ్స్ వినియోగం, ఇతర ఫండ్స్ ఖర్చుపై కలెక్టర్ ఆరా తీశారు. ఆరోగ్య శ్రీ ఫండ్స్ పక్కదారి పట్టాయనే ఫిర్యాదులపై వివరాలు అందజేయాలని అడిషనల్ కలెక్టర్‌కు కలెక్టర్ సూచించారు. అడిషనల్ కలెక్టర్ చందర్‌నాయక్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలు అరికట్టాలి..
డ్రగ్స్, గంజాయి, కల్లీ కల్లు వంటి మత్తు పదార్థాలను అరికట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్‌లో మాట్లాడారు. మత్తు పదార్థాలు తీసుకునే వారిని గుర్తించి మానిపించేందుకు అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్ వినియోగం వలన కలిగే ఆనర్థాలపై కాలేజీల్లో అవగాహన పోగ్రాంలు నిర్వహించాలన్నారు. ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడిన వారిని గుర్తించి డి అడిక్షన్ సెంటర్‌కు తరలించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా ఎక్సైజ్ అధికారి హన్మంత్‌రావు, డీఈవో రాజు, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.