ప్రభుత్వ స్థలాల రక్షణకు చర్యలు చేపట్టండి : కలెక్టర్ హరిచందన దాసరి

ప్రభుత్వ స్థలాల రక్షణకు  చర్యలు చేపట్టండి : కలెక్టర్ హరిచందన దాసరి

హైదరాబాద్ సిటీ, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల రక్షణపై కలెక్టరేట్‌‌లో ఆర్డీవోలు, ఎంఆర్వోలు, కలెక్టరేట్ విభాగాల సిబ్బందితో బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు.  ప్రభుత్వ స్థలాల రక్షణ బాధ్యత అధికారులదేనన్నారు. అలాగే షాదీ ముబారక్,  కల్యాణ లక్ష్మి చెక్కులకు  సంబంధించి మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. మరోవైపు చేయూత పెన్షన్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

 11 రకాల లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుందని, మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల పురోగతిని పరిశీలించారు. వివిధ దశల్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను ఈ నెలాఖరు నాటికి పూర్తిగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో చేయూత సెర్ఫ్ డైరెక్టర్ గోపాలరావు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ముకుంద్ రెడ్డి, డీఆర్వో వెంకటాచారి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్డీవోలు  రామకృష్ణ, సాయిరాం పాల్గొన్నారు.