వారంలో డిఫెన్స్ భూముల నివేదిక ఇవ్వండి : కలెక్టర్ హరిచందన

వారంలో డిఫెన్స్  భూముల నివేదిక ఇవ్వండి : కలెక్టర్ హరిచందన

 

  • కలెక్టర్ హరిచందన

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో గుర్తించిన డిఫెన్స్ భూములకు సంబంధించిన నివేదికలను వారంలో ఇవ్వాలని అధికారులను కలెక్టర్ హరిచందన ఆదేశించారు. ఆసిఫ్ నగర్, గోల్కొండ, నాంపల్లి, షేక్ పేటలో గుర్తించిన డిఫెన్స్ భూములపై కలెక్టరేట్ లో శుక్రవారం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్​తో కలిసి ఆమె సమీక్షించారు.

 2022 జీవో ప్రకారం నాలుగు ప్రాంతాల్లోని ఐదు ప్రదేశాలకు సంబంధించిన నివేదికలను తయారు చేయాలన్నారు. డిఫెన్స్ అధికారులతో చర్చించి, భూమి విలువ నిర్ణయం చేసిన తర్వాత ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.