మైనార్టీ గురుకులాల్లో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్

మైనార్టీ గురుకులాల్లో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మైనార్టీ గురుకులాల్లో ఆన్​ లైన్​ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందని కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ తెలిపారు. కలెక్టర్​ క్యాంప్​ ఆఫీస్​ లో ఆన్​లైన్​ ఆడ్మిషన్లను ఆయన శుక్రవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలన్నారు. కొత్తగూడెం, భద్రాచలంలో బాయ్స్​కు, బూర్గంపహాడ్​, అశ్వారావుపేట, ఇల్లెందులోని మైనార్టీ గురుకులాల్లో బాలికలకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. 

ఐదో తరగతితో పాటు ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​లో ముస్లిం మైనార్టీ పిల్లలను మైనార్టీ గురుకులాల్లో చేర్పించాలని సూచించారు. గురుకులాల్లో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు క్వాలిటీ భోజనం, ఆధునిక పద్ధతిలో సౌకర్యాలను ప్రభుత్వం గురుకులాల్లో ఏర్పాటు చేసిందన్నారు. ఈ అవకాశాన్ని మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.