బాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా మరియు అతని భార్య లిజెల్ డిసౌజా పై ముంబైలోని థానే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రెమో డిసౌజా మరియు అతని భార్య లిజెల్ డిసౌజా కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్నారు.
పూర్తివివరాల్లోకి వెళితే 26 ఏళ్ల వయసున్న కొరియోగ్రాఫర్ గతంలో తన టీం తో కలసి ఓ డ్యాన్స్ కాంపిటీషన్ లో పాల్గొన్నాడు. అయితే ఇదే డాన్స్ షోలో రెమో డిసౌజా కూడా తన టీం తో పాల్గొన్నాడు. కానీ ఈ షోలో గెలిచింది భాదిత డాన్సర్ టీం ఐతే తమకి రావలసిన రూ. 11.96 కోట్ల ప్రైజ్ మనీతో క్రెడిట్ మొత్తం ఇదే షోకి పని చేస్తున్న మరో ముగ్గురితోకలసి రెమో డిసౌజా కొట్టేసారని పోలీసులకి ఫిర్యాదు చేశారు.
ALSO READ | చిరు-బాలయ్య మల్టీస్టారర్ చిత్రానికి స్టార్ డైరెక్టర్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?
దీంతో పోలీసులు కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా మరియు అతని భార్య లిజెల్ డిసౌజాతోపాటూ మరో ముగ్గురిని కలిపి మొత్తం 5 మందిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. అలాగే భాదిత డ్యాన్సర్ తెలిపిన వివరాలు ఆధారంగా విచారణ చేపట్టారు.