వీడియో: భూమిలో మునిగిపోయిన కారు

వీడియో: భూమిలో మునిగిపోయిన కారు

ముంబయి: అవును నమ్మలేని నిజం. ఎన్నడూ చూడని నమ్మశక్యం కాని ఘటన ఇది. వీడియో చూస్తే ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకోవాల్సిందే. ముంబయి మహానగరంలో ఆదివారం చోటు చేసుకున్న ఘటన మీడియాలో హెడ్ లైన్ వార్తగా నిలుస్తోంది. అలాగే  ఫోటోలు, వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలింతకూ ఏం జరిగిందంటే..
ముంబయిలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న క్రమంలో ఘట్కోవర్ ప్రాంతంలో నమ్మశక్యం కాని.. ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఘట్కోవర్ వెస్ట్ ప్రాంతంలోని కామా లేన్ వద్ద ఉన్న ఓ ఏరియాలో కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అయితే ఆదివారం ఉదయం ఎవరూ ఊహించని కారు నిట్ట నిలువునా భూమిలో మునిగి మాయమైంది. కారు మునిగిపోయాక నీళ్లు తేలాయి. ఈ కారు పక్కనున్న కార్లు పార్కింగ్ చేసి మామూలుగానే ఉన్నాయి. కానీ నలుపు రంగు కారు మాత్రం పడవ నీటి గుంతలో పడి మాయమైనట్లు మాయమైపోయింది. అయితే కారులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.
ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాలో ప్రసారం అవుతుండడంతో ముంబయి ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. కారు నీట మునిగిన ప్రాంతంలో ఒకప్పుడు బావి ఉండేదని.. హౌసింగ్ సొసైటీ వారు దాన్ని మట్టితో పూడ్చేశారని వెల్లడించారు. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు బావిలోని మట్టి అంతా బురదలా మారిపోయిందని.. పై పొర గట్టిగా ఉన్నప్పటికీ కారు బరువుకు కరిగిపోవడంతో కారు ఒక్కసారిగా మునిగిపోయిందని స్పష్టం చేశారు. ఈ ఘటన ఎలా జరగిందో వీడియో మీరూ చూసేయండి.