
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మౌన బాబాగా మారిపోయారని కాంగ్రెస్ సెటైర్ వేసింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన దేశం గురించి మాట్లాడినప్పుడల్లా మోదీ మౌనంగా ఉండిపోతారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
‘‘ఇండియా, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ ఎన్నోసార్లు చెప్పినా మోదీ ఒక్కసారి కూడా ఖండించలేదు. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుడు బంజేస్తమని మోదీనే తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్తున్నా కూడా ప్రధానిమాట్లాడట్లేదు” అని జైరాం రమేశ్ ఆరోపించారు.
ట్రంప్ నోట మళ్లీ అదే మాట..
రష్యా ఆయిల్ కొనుగోలు ఆపేస్తామని మోదీ హామీ ఇచ్చారని ఇదివరకే చెప్పిన ట్రంప్.. శనివారం మళ్లీ అదే మాట చెప్పారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయదన్నారు. ‘‘ఇండియా వెనక్కి తగ్గింది. ఇప్పటికే కొనుగోళ్ల శాతం తగ్గింది”అని అన్నారు.