కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

వరంగల్:  కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం చెలరేగింది. 20మంది మెడికోలకు కరోనా నిర్దారణ అయింది. ఆస్పత్రికి వస్తున్న రోగులకు చికిత్స అందించేందుకు సహాయపడే మెడికోలు నిరంతరం రోగుల మధ్య సంచరిస్తుండడంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే చాలు ముందు జాగ్రత్తగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో నిన్న పలువురు వైద్య విద్యార్థులకు, నర్సులకు, ఆస్పత్రికి సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒమిక్రాన్ లక్షణాలు కనిపించిన వారి శాంపిల్స్ ను జీనోమ్ టెస్టులకు పంపించారు. మెడికల్ కాలేజీలో 20 మంది మెడికోలకు కరోనా సోకడంతో కాలేజీ, ఆస్పత్రిలో కలకలం చెలరేగింది. మిగిలిన వైద్య విద్యార్థులు వారికి పాఠాలు బోధించి శిక్షణ ఇచ్చే ప్రొఫెసర్ లకు కూడా సోకి ఉంటుందేమోనన్న అనుమానాల నేపథ్యంలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. 

 

ఇవి కూడా చదవండి

కొంప ముంచిన పెంపుడు శునకం బర్త్ డే పార్టీ

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం