ఉప్పల్, వెలుగు: చిట్టీల పేరుతో రూ.3 కోట్ల వరకు వసూల్ చేసి దంపతులు ఉడాయించారు. ఉప్పల్ పోలీసుల వివరాల ప్రకారం.. చిలుకానగర్ పరిధిలోని కుమ్మరికుంటకు చెందిన సురేశ్, శాంతి దంపతులు. గత పదేండ్లకు పైగా కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ చిట్టీలను నడిపించి, కాలనీవాసులతో నమ్మకంగా ఉండేవారు.
ఈ క్రమంలో కాలనీలోని పలువురి వద్ద రూ.3 కోట్ల వరకు వసూలు చేసి, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. భార్యాభర్తల ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో బాధితులు గురువారం ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.
