
క్రికెట్కు మరో హైదరాబాద్ ప్లేయర్ వీడ్కోలు పలికాడు. హైదరాబాద్ రంజీ మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ కొల్లా సుమంత్ అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. సెంట్రల్ ఎక్సైజ్‌లో ఉద్యోగం మానేసి గతేడాది ఫుల్‌టైమ్ కోచ్‌గా మారిన 31 ఏళ్ల సుమంత్ హైదరాబాద్‌కు 35 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఒక సెంచరీ, 10 హాఫ్ సెంచరీల సహాయంతో మొత్తం 1453 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 111 పరుగులు. రామగుండంకు చెందిన ఈ వికెట్‌కీపర్ 109 క్యాచ్‌లు, ఆరు స్టంపింగ్‌లు కూడా చేశాడు.
నేను ఆట నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. అన్ని స్థాయిల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. నా ప్రతిభను గుర్తించి నాకు అవకాశం ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు. HCA మద్దతు లేకుండా, ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. కోచ్ గా అవకాశం ఇచ్చిన హైదరాబాద్ క్రికెట అసోసియేషన్ కు ధన్యవాదాలు. నా తదుపరి ప్రయాణంలో వర్ధమాన క్రికెటర్లకు మార్గనిర్దేశం చేయడం కోసం ఎదురు చూస్తున్నాను.