సీఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఐఆర్ ఎన్ఈఈఆర్ఐ) ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ, ఎంఎస్సీ పూర్తిచేసిన అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. మార్చి 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
ఖాళీలు: 4. (ప్రాజెక్ట్ అసిస్టెంట్–II 2, ప్రాజెక్ట్ అసిస్టెంట్– I 2)
ఎలిజిబిలిటీ
ప్రాజెక్ట్ అసిస్టెంట్-II: వృక్షశాస్త్రం / జంతుశాస్త్రం / మత్స్యశాస్త్రం / అటవీశాస్త్రం / పర్యావరణశాస్త్రం / వ్యవసాయంలో బి.ఎస్.సి. పూర్తిచేసి ఉండాలి.
ప్రాజెక్ట్ అసోసియేట్-I: వృక్షశాస్త్రం / జంతుశాస్త్రం / మత్స్యశాస్త్రం / అటవీశాస్త్రం / పర్యావరణ శాస్త్రం / వ్యవసాయంలో ఎం.ఎస్.సి. పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 16.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: మార్చి 24.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.neeri.res.in ను సందర్శించండి.
