లేబర్ క్యాంపుల్లో కార్మికులకు అవగాహన

లేబర్ క్యాంపుల్లో కార్మికులకు అవగాహన

నార్సింగి, వెలుగు : సైబరాబాద్ భరోసా గచ్చిబౌలి కేంద్రం ఆధ్వర్యంలో నార్సింగిలోని లేబర్ క్యాంప్‌‌‌‌‌‌‌‌, గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ లేబర్ అడ్డా, ఖాజగూడలోని ప్రశాంతి హిల్స్ లో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. లేబర్​క్యాంపుల్లో కార్మికులకు సామాజిక అంశాల గురించి అర్థమయ్యేలా వివరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అక్రమ రవాణా, పోక్సో, విద్యా ప్రాముఖ్యత గురించి వివరించారు.

గృహ హింస, పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక చట్టాలు, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాల గురించి చెప్పారు. పిల్లలు ఆడ అయినా..మగ అయినా సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. సదస్సులో 62 మంది కార్మికులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. భరోసా కేంద్రం లీగల్ కౌన్సిలర్లు పవిత్ర, అంజలి, కౌన్సిలర్ హిమా కెరెన్ పాల్ పాల్గొన్నారు.