
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టు నిర్ణిత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులే చేసింది. కిమ్ గార్త్ (32) టాప్ స్కోరర్. జార్జియా వేర్‌హామ్ (22), హర్లీన్ డియోల్ (20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. 33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్‌ను జార్జియా, కిమ్ గార్త్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తరువాత లక్ష్య చేధనలో బరిలో దిగిన ఢిల్లీ జట్టు 7.1 ఓవర్లోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (76; 28 బంతుల్లో) వీర విహారం చేసింది. ఇందులో 10 ఫోర్లు, 5 సిక్స్‌లున్నాయి. షెఫాలీ 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్ మెగ్ లానింగ్ (21*) ఆమెకు చక్కని సహకారం అందించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది మూడో విజయం.