V6 News

ఢిల్లీలో పటాకులు కాల్చుడు బ్యాన్ చేయాల్సిందే!

ఢిల్లీలో పటాకులు కాల్చుడు బ్యాన్ చేయాల్సిందే!
  • కేంద్రాన్ని కోరిన ఆప్​ సర్కారు
  • అప్పర్ మిడిల్​ క్లాస్ జనాల కోసం
  • ఏసీ ప్రీమియం బస్సులు: కేజ్రీవాల్​

న్యూఢిల్లీ: పొల్యూషన్​ను కట్టడి చేసేందుకు నేషనల్ కేపిటల్ రీజియన్(ఎన్సీఆర్) పరిధిలో పటాకులు కాల్చడాన్ని పర్మినెంట్​గా బ్యాన్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఢిల్లీలోకి డీజిల్ బస్సుల రాకపోకలపైనా పూర్తికాల నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్​లో కలిసి ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ మంత్రులు శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం ఢిల్లీ మంత్రి గోపాల్​రాయ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. వచ్చే చలికాలంలో ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో ఎయిర్ పొల్యూషన్​ను ఎదుర్కొనేందుకు ఒక కార్యాచరణ ప్లాన్ రూపొందించాలని, అందుకు ఎన్సీఆర్​ రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.

ఏసీ ప్రీమియం బస్సులు

దేశ రాజధానిలో  త్వరలో తాము ప్రీమియం బస్ అగ్రిగేటర్ సర్వీస్ స్కీమ్ ప్రవేశపెట్టనున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగించేలా ప్రోత్సహించడంతో పాటు తద్వారా  రోడ్లపై ట్రాఫిక్ తగ్గించడం, ఎయిర్ పొల్యూషన్ అరికట్టాలనే ఉద్దేశంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.