పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్... ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే. బాహుబలి సిరీస్ నుండి మొన్నటి కల్కి వరకు ఆయన సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తేనే మైండ్ బ్లాంక్ అవుతుంటే, ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ తెగ హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్,' దురంధర్ ' ఫేమ్ ఆదిత్య ధర్.. ప్రభాస్‌తో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య ప్రాథమిక చర్చలు కూడా జరిగాయని సమాచారం.
టాలీవుడ్ కటౌట్‌కి.. బాలీవుడ్ ఇంటెన్స్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర విధ్వంసమే. ఆదిత్య ధర్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ యాక్షన్ డ్రామాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే నైపుణ్యం ఉంది. అందుకే ఈ కాంబో అనౌన్స్‌మెంట్ రాకముందే ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ట్విస్ట్ ఏంటంటే... ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం అంత ఈజీ కాదు! ఎందుకంటే ప్రభాస్ డైరీ రాబోయే రెండేళ్ల వరకు ఫుల్ బిజీ.
►ALSO READ | మళ్లీ వాయిదా పడ్డ అఖిల్ 'లెనిన్'.. రూమర్స్‌కు చెక్ పెడుతూ కొత్త డేట్ ప్రకటించిన నాగార్జున!
ప్రస్తుతం డార్లింగ్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ పోవాల్సిందే.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పిరియడ్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' (Fauzi). ఈ మూవీలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా, జయప్రద కీలక పాత్రలో నటిస్తున్నారు. 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ చేస్తున్న పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీ 'స్పిరిట్' (Spirit) దీనికోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు.
మరో వైపు నాగ్ అశ్విన్ విజువల్ వండర్ 'కల్కి' సీక్వెల్ కూడా లైన్‌లో ఉంది. కాబట్టి ఆదిత్య ధార్‌తో సినిమా ఓకే అయినా, అది సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
