ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ)లో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్లాంట్ బ్రీడింగ్/ జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్/ జెనెటిక్ రిసోర్సెస్/ జెనెటిక్స్/ ప్లాంట్ బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. రెండేండ్ల అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: జూన్ 16.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ pjtau.edu.inను సందర్శించండి.
