ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారీగా రష్యా సైనికుల మోహరింపు

ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారీగా రష్యా సైనికుల మోహరింపు

ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్ష మంది రష్యా సైనికులు మోహరించారు. రష్యా ఆక్రమించిన క్రిమియా ద్వీపకల్పం సమీపంలోనూ భారీగా సైనికులున్నారు. చిన్న నోటీసుతో, ఏక్షణమైనా రష్యా దాడులు చేపట్టవచ్చని హెచ్చరించాయి అమెరికా నిఘా వర్గాలు. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని తమ రాయబార కార్యాలయాన్ని 48 గంటల్లో మూసివేసేందుకు అమెరికా చర్యలు చేపట్టింది. కొంత మందితో పోలండ్ సరిహద్దుల్లోని ఎల్వివ్ లో కాన్సులర్ కార్యాలయాన్ని నిర్వహంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మిగతా సిబ్బంది వెనక్కి రావాలని ఇప్పటికే ఆదేశించింది.