
తెలుగు డైరెక్టర్ మోహన్ శ్రీవత్స.. తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. తాను తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాకు థియేటర్స్లో ఆడియన్స్ ఎవ్వరు రాకపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు.
అయితే, సినిమా టాక్ బాగున్నప్పటికీ.. తాను వెళ్లిన థియేటర్లో కేవలం 10 మంది మాత్రమే ప్రేక్షకులు ఉన్నారు. నేనెవరో చెప్పకుండా అక్కడ వారిని సినిమా ఎలా అనిపించిందని అడగ్గా..? కంటెంట్ బాగుందని చెప్పి, తనను హాగ్ చేసుకున్నారని గుర్తుచేసుకున్నారు.
అలానే శనివారం ఆగస్టు 30న సాయంత్రం నా భార్యతో మూవీ చూసేందుకు వెళ్లాను. మనసు ఏం బాగోలేక అరగంటలోనే ఇంటికి తిరిగొచ్చేశాను. నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానో అని భయపడి నా భార్య కూడా నాతో పాటు వచ్చేసింది. అసలు సినిమా చూడకముందే.. బాలేదని థియేటర్కు రాకపోతే ఎలా? అంటూ వాపోయారు.
ఈ క్రమంలో ఇంకేం చేస్తే , జనాలు సినిమాకు వస్తారు భయ్యా? రెండున్నరేళ్ల కష్టపడి తీసిన సినిమా ఇది. ఓ మలయాళ సినిమాకు ఇచ్చే ఆదరణ మన తెలుగు సినిమాకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసి బోరున ఏడ్చారు. ఇలా అయితే నేను సినిమాని మలయాళంలో తీసి తెలుగు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలంటూ డైరెక్టర్ మోహన్ ఆవేదన చెందారు.
అయితే, మూవీ ప్రమోషన్స్ టైంలో డైరెక్టర్ మోహన్ శ్రీవత్స 'బార్బరిక్ మూవీ బాగా లేకుంటే.. నన్ను చెప్పుతో కొట్టండి.. అని చాలా నమ్మకంతో మాట్లాడారు. అపుడు తన కాన్ఫిడెంట్ పట్ల సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకున్నప్పటికీ.. ఇది జరగలేదు. ఈ క్రమంలో మోహన్ భావోద్వేగంతో సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
బార్బరీక్ మూవీ గురించి:
‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైంది. ఇందులో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్. సింహా, సత్యం రాజేశ్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. దర్శకుడు మోహన్ శ్రీ వత్స తెరకెక్కించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకులుగా వ్యవహరించగా, విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించారు. సినిమా రిలీజ్ కు ముందే పెయిడ్ ప్రీమియర్ల ద్వారా మంచి టాక్ అందుకుంది.
ముఖ్యంగా, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు కుటుంబ విలువలు, భావోద్వేగాలు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు డైరెక్టర్ మోహన్. అయితే, థియేటర్లో మూవీ చూడటానికి ఆడియన్స్ ఎవ్వరూ రాకపోవడంతో మోహన్ ఎమోషనల్ అయ్యారు.