రైలుడబ్బా రెస్టారెంట్

రైలుడబ్బా రెస్టారెంట్

రైలుబండిలో జర్నీ మంచిగనిపిస్తది. కానీ, రైల్వేస్టేషన్​లో ఫుడ్​ తిందామంటే తినబుద్ది కాదు. కారణం  చాలావరకు పరిసరాలు అంత శుభ్రంగా ఉండకపోవడమే. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్​ టెర్మినల్​​లో అలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడి రైలుడబ్బాలో కూర్చొని కడుపారా నచ్చిన ఫుడ్​ తినొచ్చు. ఆ రైల్వేస్టేషన్​లోని పద్దెనిమిదో నెంబర్​ ప్లాట్​ఫామ్​ మీద ఒక రైలు బోగీ ఆగి ఉంటుంది. దాని పేరు ‘బోగీ వాగీ’. అదొక రెస్టారెంట్​. పాత రైలు డబ్బాకి రంగులు వేసి, బోగీ మీద ఛత్రపతి శివాజీ,  ఛత్రపతి శివాజీ మహరాజ్​ టెర్మినల్​​, తాజ్​హోటల్​, ఒబెరాయ్​ హోటల్​ బొమ్మలు  వేసి అందంగా డెకరేట్​ చేశారు. లోపల కుర్చీలు, టేబుళ్లు వేసి రెస్టారెంట్​ లుక్​ తెచ్చారు. ఇందులో నార్త్ ​ఇండియన్​, సౌత్​ ఇండియన్​ వంటకాలతో పాటు చైనీస్​ రుచుల్ని కూడా వడ్డిస్తున్నారు. రైల్వేస్టేషన్​ దగ్గర్లోని ‘హెరిటేజ్​ గల్లీ’లో ఉన్న ఈ రెస్టారెంట్​ సెంటరాఫ్​ అట్రాక్షన్.
ఇలాంటివి మరికొన్ని చోట్ల
‘‘ఈ కోచ్​ వాడుకలో లేదు. అందుకే దీన్ని రెస్టారెంట్​గా మార్చాం. ఈ రెస్టారెంట్ కస్టమర్లకి మంచి ఎక్స్​పీరియెన్స్​ ఇస్తుంది. ఇందులో పది టేబుళ్లు ఉంటాయి. 40 మంది ఒకేసారి తినొచ్చు. పార్శిల్​ సౌకర్యం కూడా ఉంది.  రైల్వే ప్యాసింజర్లతో పాటు బయటివాళ్లకి కూడా ఎంట్రీ ఉంది. ఈ రెస్టారెంట్​ ఐడియా బాగా క్లిక్​ అయింది. దాంతో లోకమాన్య తిలక్​ టెర్మినల్​​, కల్యాణ్ జంక్షన్​, లోనావాలా రైల్వేస్టేషన్లలో కూడా ఇలాంటి రెస్టారెంట్లు నడపా లనే ఆలోచనతో ఉన్నాం” అంటున్నాడు సెంట్రల్​ రైల్వేస్​ చీఫ్​ పబ్లిక్​ రిలేషన్స్​ ఆఫీసర్​ శివాజీ సుతార్​.