కుక్కల సంక్షేమానికి పదెకరాలిస్తా: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మికాసింగ్

కుక్కల సంక్షేమానికి పదెకరాలిస్తా: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మికాసింగ్

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, పాప్ సింగర్ మికా సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కుక్కల రక్షణ కోసం పదెకరాల భూమిని ఇస్తామని ప్రకటించారు. వీధి కుక్కల నిర్వహణపై విచారణ జరుగుతున్న క్రమంలో కుక్కల సంక్షేమానికి  హాని కలిగించే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టుకు విజ్ణప్తి చేశారు మికాసింగ్. శిక్షణ పొందిన సంరక్షుల సపోర్టుతో కుక్కలకు ఆశ్రయం కల్పించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం తాను పదెకరాల భూమిని  విరాళంగా ఇస్తానని  సోషల్ మీడియా ప్లాట్ ఫాం X ద్వారా ఎమోషనల్ పోస్ట్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలిపారు. 

బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న క్రమంలో మికాసింగ్ ఈ ప్రతిపాదనలు చేశారు. కుక్కకాటు, రాబిస్ ప్రమాదాలు, మున్సిపల్ నియంత్రణ లేకపోవడం వంటి సమస్యలతో కుక్కల నిర్వహణపై ఆందోళనలు వెల్లువెత్తాయి.  వీధికుక్కల సంబంధిత సమస్యలను  సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. మరోవైపు వీధి కుక్కల నిర్వహణ, ప్రజాభద్రతపై ప్రముఖ నటి షర్మిలా ఠాకూర్ సుప్రీంకోర్టు పిటిషన్ వేయగా ప్రస్తుతం ఆ కేసును సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ కేసు మరోసారి మంగళవారం(జనవరి13)   విచారణకు రానుంది.