మీ డెడికేషన్‎కు హ్యాట్సాఫ్: కోటర్ కోసం ప్రాణాన్నే రిస్క్ చేసిన మందుబాబు.. వీడియో వైరల్

మీ డెడికేషన్‎కు హ్యాట్సాఫ్: కోటర్ కోసం ప్రాణాన్నే రిస్క్ చేసిన మందుబాబు.. వీడియో వైరల్

మద్యం బాబులు చేసే పనులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తాయి. తాజాగా అలాంటి కోవకు చెందిన ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మద్యం బాటిల్‌ను తీసుకునే ప్రయత్నంలో వైన్స్ ముందుండే ఇనుప గ్రిల్‌లో తల ఇరికి ఇబ్బంది పడ్డాడు. మానవత్వం గల ఇతర మందు బాబులు తీవ్రంగా కృషి చేసి తోటి లిక్కర్ ఫ్రెండ్ తలను జాగ్రత్తగా ఇనుప గ్రిల్ నుండి బయటకు తీశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీగా తెలియనప్పటికీ.. మందు బాబు చేసిన పని మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వీడియో ప్రకారం.. వైన్స్ మూసే సమయం కావడంతో ఓ వ్యక్తి పరుగు పరుగున వైన్స్ వద్దకు వచ్చాడు. దుకాణం క్లోజ్ చేస్తుండటం, రద్దీ ఎక్కువగా ఉండటంతో కోటర్ సీసా అందుకోవడమే లక్ష్యంగా తలను వైన్స్ ముందుండే ఇనుప గ్రిల్స్ నుంచి లోపలికి పెట్టాడు. కోటర్ బాటిల్ తీసుకున్నాడు. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. బాటిల్ దక్కించుకోవాలంటే తొందరలో తలను అయితే ఇనుప గ్రిల్స్ నుంచి లోపలికి పెట్టాడు. కానీ తీసేటప్పుడు తల బయటకు రాకుండా గ్రిల్స్‌లో ఇరుక్కుంది.

దీంతో సదురు వ్యక్తి తలను బయటకు తీసేందుకు నానా విధాల ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఎంత ప్రయత్నించినా తల బయటకు రాలేదు. అన్నా అంటే నేను ఉన్నానంటూ పలికే తోటి మందు బాబులు.. సహచర తాగుబోతు కష్టాన్ని చూడలేక చలించిపోయారు. వెంటనే మానవత్వంతో ముందుకు వచ్చి ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కున్న సహచర తాగుబోతు తలను బయటకు తీశారు. ఇనుప గ్రిల్స్‌లో తల ఇరుక్కుని ఇంత అవస్థపడ్డప్పటికీ చేతిలో ఉన్న మందు సీసాను మాత్రం వదలలేదు ఆ మందుబాబు.

►ఇంకా చదవండి |  ఐటీ నోటీసులిచ్చిన మరుసటి రోజే..మంత్రి ఇంట్లో నోట్ల కట్టల బ్యాగ్.. వీడియో వైరల్

 ఎన్ని కష్టాలు పడ్డ కోటర్ సీసాను మాత్రం చేజారనివ్వకుండా మద్యం తన నిబద్ధతను చాటుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. 'ప్రాణమైన పోని కానీ మద్యం పోని' అని ఒకరు.. 'తాగుబోతుల్లో అత్యున్నత స్థాయి వ్యక్తి' అని మరోకరు సరదాగా కామెంట్స్ చేశారు.  

ఈ చక్రంలో సబ్ చక్రా గే
😝😝😂😂🤣🤣 pic.twitter.com/bR1HeomdU7

— మన్‌ప్రీత్ కౌర్❤మన్💕 (@mannkaurr1) జూలై 8, 2025