
మహారాష్ట్ర న్యాయ శాఖ మంత్రి సంజయ్ శిర్సాత్ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఆదాయ పన్ను (IT) శాఖ నోటీసు అందుకున్న మరుసటి రోజే నగదు నిండిన బ్యాగు పక్కన పెట్టుకుని పొగ తాగుతున్న ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే, మహారాష్ట్ర న్యాయ శాఖ మంత్రి అయిన సంజయ్ శిర్సాత్ కు సంబంధించిన వీడియో ఒకటి శుక్రవారం(జూలై 11) సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సంజయ్ శిర్సాత్ తన బెడ్‌రూమ్‌లో సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నారు. ఆయన పక్కనే ఒక బ్యాగు తెరిచి ఉండగా అందులో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు కనిపిస్తోంది. ప
క్కనే మరో సూట్‌కేస్ కూడా ఉంది. సంజయ్ శిర్సాత్ కు ఐటీ శాఖ నోటీసులిచ్చిన మరుసటి రోజే ఈ వీడియో వైరల్ అయింది. ఎప్పుడు చిత్రీకరించబడిందో స్పషత లేదు గానీ..సోషల్ మీడియాలో, అటు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంవశం అయింది.
సంజయ్ శిర్సాత్‌కు ఆదాయ పన్ను శాఖ గురువారం నోటీసు జారీ చేసింది. 2019 ,2024 అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆయన ఆస్తులలో విపరీతమైన పెరుగుదల కనిపించడంతో ఐటీ శాఖ దీనిపై వివరణ కోరింది. అయితే కొందరు తనపై ఐటీ విభాగానికి ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగానే తనకు నోటీసు వచ్చిందని శిర్సాత్ తెలిపారు.
►ALSO READ | రూ. 40 కోట్ల మోసం వెలుగులోకి.. తిరుమల డైరీ ట్రెజరీ మేనేజర్ ఆత్మహత్య..
ఈ నోటీసుకు చట్టబద్ధంగా సమాధానం ఇస్తానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు ఉండవని ప్రజలు అనుకుంటారని, కానీ అది నిజం కాదని ఆయన అన్నారు.
వివాదాస్పద వీడియోపై స్పందన
నగదు నిండిన బ్యాగుతో ఉన్న వీడియో వైరల్ అయిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. విపక్షాలు శిర్సాత్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. అయితే శిర్సాత్ గానీ, శివసేన (షిండే వర్గం) గానీ ఈ వీడియోపై అధికారికంగా స్పందించలేదు.
ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ప్రత్యేకించి ఐటీ నోటీసు అందుకున్న వెంటనే ఇలాంటి వీడియో బయటపడటం పలు అనుమానాలకు దారితీసింది.