
రూ. 40 కోట్ల మోసం వెలుగులోకి రావడంతో తిరుమల డైరీ ట్రెజరీ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన బాలినేనికి నవీన్ చెన్నైలోని మాధవరంలో ఉన్న తిరుమల డైరీలో ట్రెజరీ మేనేజర్ గా పని చేస్తున్నాడు. కంపెనీలో అడిట్ నిర్వహించగా ఆటను రూ. 40 కోట్ల మోసానికి పాల్పడ్డట్టు తెలిసింది. మోసానికి పాల్పడ్డట్టు అంగీకరించిన నవీన్ ఒక్కరోజులో నగదు ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయినందుకు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.జులై 9న జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
డబ్బు ఇవ్వలేకపోయిన నవీన్ పుళల్ బ్రిటానియానగర్‌లో తనకు చెందిన షెడ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
నవీన్ ఆత్మహత్య చేసుకునే ముందు ఏపీలో ఉన్న తనకు ఈమెయిల్ పంపారని.. విషయం తెలుసుకున్న వెంటనే చెన్నై వచ్చి చూడగా నవీన్ అప్పటికే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది నవీన్ సోదరి. తనను ఐదుగురు అధికారులు బెదిరిస్తున్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నవీన్ ఈమెయిల్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కంపెనీ నిర్వహించిన ఆడిటింగ్ లో ట్రెజరీ మేనేజర్ గా పనిచేస్తున్న నవీన్ రూ. 40 కోట్ల మోసానికి పాల్పడ్డట్టు కంపెనీ లీగల్ మేనేజర్ జూన్ 24న చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు పోలీసులు. ఇందుకు సంబందించిన పేపర్స్ కి ఏవీ తమకు ఇవ్వకపోవడంతో నవీన్ ను పిలిపించి ఫిర్యాదు చేయలేదని తెలిపారు పోలీసులు.
ALSO READ : మాలల సింహగర్జనతో కొందరి నోర్లు మూతపడ్డయ్: మంత్రి వివేక్ వెంకటస్వామి
నవీన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రెండుసార్లు వాయిదా పడిందని.. ఈ క్రమంలో తన సోదరికి, తిరుమల డైరీ కంపెనీకి ఈమెయిల్ పంపి ఆత్మత్యాహత్యకు పాల్పడ్డారని తెలిపారు పోలీసులు.