ఏంటండీ ఈ అరాచకం.. తాగి రోడ్లపై పోలీసులను కొట్టిన మహిళ

ఏంటండీ ఈ అరాచకం.. తాగి రోడ్లపై పోలీసులను కొట్టిన మహిళ

ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఓ వీడియోలో వడోదరకు చెందిన ఒక తాగుబోతు మహిళ పోలీసులతో దూకుడుగా ప్రవర్తించింది. ఆమె అసంబద్ధ ప్రవర్తన కారణంగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లో మద్యపానం నిషేధించిన తర్వాత కూడా మద్యం అమ్మకాలు, వినియోగం ఏ రేంజ్ లో జరుగుతుందో ఈ వీడియో చూపిస్తుంది. ఇందువో మహిళ రోడ్డుపై పోలీసులను దూషించడం, కొట్టడానికి ప్రయత్నించడం చూడవచ్చు. ఇంతలోనే ఆమెను ఓ మహిళా కానిస్టేబుల్ అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎటువంటి తేడా కనిపించలేదు. పోలీసులపై దాడి చేసేందుకు సైతం ఆమె ప్రయత్నించింది. మద్యం మత్తులో కారు నడుపుతూ పట్టుబడటంతో ఈ వివాదం మొదలైంది. ప్రస్తుతం ఈ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వీడియోను గమనిస్తే.. తన కారును ఆపిన పోలీసు అధికారిని వీడియో తీయడానికి మహిళ ప్రయత్నించింది. తమను వీడియో తీయొద్దని ఒక మహిళా పోలీసు అధికారి ఆ మహిళను కోరింది. కానీ ఆమె మాత్రం వినిపించుకోలేదు. పోలీసు అధికారిని చిత్రీకరించడం కొనసాగించింది. ఇదే సమయంలో పోలీసు అధికారి మహిళ మొబైల్‌ ఫోన్‌ను బలవంతంగా లాక్కెళ్లడంతో గొడవ మొదలైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు.

కొన్ని రోజుల క్రితం ఓ మహిళ.. పోలీసు అధికారిని చెంపదెబ్బ కొట్టిన ఓ వీడియో సైతం వైరల్‌గా అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. ఈ గొడవ వెనుక కారణం స్పష్టంగా తెలియరాలేదు. కానీ ఢిల్లీకి చెందిన ఓ మహిళ పోలీసు అధికారిని కొట్టినట్లు మాత్రం ఈ షాకింగ్ ఫుటేజీలో ఉంది. దాన్ని ఆపేందుకు కొంతమంది జోక్యం చేసుకున్నా.. ఆమె మాత్రం ఓ కానిస్టేబుల్‌పై దాడి చేస్తూనే ఉంది.