పరిగిలో 3 వేల కోట్లతో అభివృద్ధి పనులు.. త్వరలో ఫోర్ లైన్ రోడ్డు పూర్తి చేస్తాం: భట్టి విక్రమార్క

పరిగిలో 3 వేల కోట్లతో అభివృద్ధి పనులు.. త్వరలో ఫోర్ లైన్ రోడ్డు పూర్తి చేస్తాం: భట్టి విక్రమార్క

గత పదేళ్లలో కృష్ణా నదిపై బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత పదేళ్లు రాష్ట్ర వనరులను దోపిడి చేశారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో  400 కేవీ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు భట్టి విక్రమార్క.  ఈ సందర్భంగా.. 8 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. 

అనంతరం మాట్లాడిన ఆయన.. ప్రజలకు సుపరిపాలన కోసం సోనియా తెలంగాణ ఇస్తే..బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. ఈ ప్రాంత అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి బీఆర్ఎస్  చేసిందేమీ లేదన్నారు.  33కేవీ 9 సబ్ స్టేషన్లు  పరిగికి వస్తున్నాయని తెలిపారు. కరెంట్ అంటేనే కాంగ్రెస్ .. కాంగ్రెస్  అంటేనే కరెంట్ అని అన్నారు భట్టి.  

పరిగిలో 3 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.  త్వరలో ఫోర్ లైన్ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వికారాబాద్ లో 67 శాతం ప్రజలు ఉచిత విద్యుత్ ను పొందుతున్నారని చెప్పారు. . చేవేళ్ల రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు భట్టి.