
కంటెంట్ క్రియేటర్లు, స్ట్రీమర్లు కంప్యూటర్ల ముందు కూర్చుని గంటల తరబడి పనిచేస్తుంటారు. ఒక సాఫ్ట్‌వేర్ నుంచి మరో సాఫ్ట్‌వేర్‌కి పదే పదే స్విచ్ అవుతుంటారు. అలాంటప్పుడు కొంతవరకు టైం వృథా అవుతుంటుంది. కానీ.. ఈ స్ట్రీమ్ డెక్ ఎంకే2 ఉంటే చాలా వేగంగా పని చేసుకోవచ్చు. దీన్ని ఎల్గాటో అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో 15 ఎల్‌సీడీ కీలు ఉంటాయి. వాటిలో ఒక్కోదాన్ని ఒక్కో సాఫ్ట్‌వేర్ కోసం కస్టమైజ్ చేసుకోవచ్చు. కీ నొక్కగానే కస్టమైజ్ చేసి పెట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఓపెన్ అవుతుంది. ఇది మ్యాక్, విండోస్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లో వచ్చే యూఎస్‌బీ 2.0 కేబుల్‌ను ఉపయోగించి హోస్ట్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కీస్‌ని ఎరోప్లేన్ మోడ్, వ్యాల్యూమ్‌ని కంట్రోల్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. దీని ధర రూ.11,499.