ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలె

ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలె

హైదరాబాద్ : గిరిజన బిడ్డకి రాష్ట్రపతి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళి సై. 75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు భారత సేవ ఆశ్రమం ఆధ్వర్యంలో ఫ్లాగ్స్ తో పాటు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. చిన్నారులతో సరదాగా గడిపారు. విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. రాజ్ భవన్ స్కూల్ స్టడీ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. టీచర్స్ ను మరింత కేర్ తీసుకోవాలని గవర్నర్ తమిళి సై సూచించారు. 

స్కూల్ విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి..75 మంది పిల్లల్ని ఎంపిక చేసి వారికి బహుమతులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని జనానికి సూచించారు గవర్నర్ తమిళిసై.