వర్షాలు పడుతుండడంతో రైతులు సాగు పనుల్లో బిజీగా మారారు. దుక్కులు దున్నడం, పొలాలను సాగుకు సిద్ధం చేయడం, విత్తనాలు, ఎరువుల సమీకరణ వంటి పనులు జోరందుకున్నాయి. ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు దుక్కులు దున్నుతూ విత్తనాలు వేసుకుంటున్నారు. మరో వైపు సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
