వరంగల్ లో రోడ్లపై రైతుల ధర్నా

వరంగల్ లో రోడ్లపై రైతుల ధర్నా

వరంగల్ జిల్లా నర్సంపేట రోడ్డుపై ధర్నా చేశారు రైతులు. వడగండ్ల వానతో పంటనష్టపోయిన తమను ప్రభుత్వం  ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో ఇటుకాలపల్లి మెయిన్ రోడ్డు రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురుగాలులతో చాలా గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దఎత్తున మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన తమకు.. వడగండ్ల వాన మరింత నష్టాన్ని కలిగించిందన్నారు. ప్రభుత్వం తమకు పరిహారం అందించి ఆదుకోవాలన్నారు రైతులు.

 

మరిన్ని వార్తల కోసం..

ఒమిక్రాన్ పై డౌట్స్ ఉంటే ఈ నంబర్ కు వాట్సాప్ చేయండి