ఒమిక్రాన్ పై డౌట్స్ ఉంటే ఈ నంబర్ కు వాట్సాప్ చేయండి
V6 Velugu Posted on Jan 13, 2022
ఖైరతాబాద్, వెలుగు: ఒమిక్రాన్ అంత డేంజరేం కాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ సంపత్ రావు అన్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీస్కోవాలని, కరోనా రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు. దీర్ఘకాలిక రోగాలు ఉన్నోళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు మాస్కులు పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం మరవొద్దన్నారు. బుధవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతమంది టీకాలు, మాస్క్ లతో ఎలాంటి ఉపయోగం లేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటోళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ ను కోరారు. ఎవరికైనా ఒమిక్రాన్ పై డౌట్స్ ఉంటే 94921 94989 నంబర్ కు వాట్సాప్ చేయాలని సూచించారు. ఐఎంఏ స్టేట్ సెక్రటరీ నరేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tagged Covid vaccine, IMA, Omicron variant, Omicron not danger