వరంగల్​ కలెక్టర్​కు రైతుల వేడుకోలు

వరంగల్​ కలెక్టర్​కు రైతుల వేడుకోలు
  • పట్టాలిప్పించండి సారూ..
  • వరంగల్​ కలెక్టర్​కు రైతుల వేడుకోలు
  • రికార్డుల్లో పేర్లు లేక 450 మంది గోస

నర్సంపేట, వెలుగు : తాము ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూము లకు పట్టాలివ్వాలని కోరుతూ వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన ఏడు గ్రామాల రైతులు కలెక్టరేట్​కు వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. కన్నా రావుపేట, పద్మాపురం, మూడుచెక్కలపల్లి, పంతులుపల్లి, అర్వయ్యపల్లి, రామతీర్థం, బుచ్చిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 15 మంది రైతులు సోమవారం గ్రీవెన్స్​కు వచ్చి కలెక్టర్ డాక్టర్ గోపి, జేసీ హరిసింగ్​ను కలిశారు. ఏడు గ్రామాల పరిధిలోని సర్వే నంబర్​58లో సుమారు 1,807 ఎకరాల భూములను తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని తెలిపారు. అయినా రెవెన్యూ రికార్డులకు ఎక్కలేదన్నారు. కరోనాకు ముందు రెవెన్యూ ఆఫీసర్లు చేసిన సర్వేలో 1,300 ఎకరాలను వివాదరహిత భూ ములుగా గుర్తించి 700 ఎకరాలకు పట్టాలిచ్చార ని, మరో 600 ఎకరాలు పెండింగ్​లో పెట్టారని చె ప్పారు. దీంతో 450 మంది ఇబ్బందులు పడ్తున్నారని, రైతుబంధు, రైతుబీమాకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాలిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్, జేసీ హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.

ఆడిటింగ్ సక్కగ చేయకుండానే ఫీజుల పెంపు

హైదరాబాద్,వెలుగు : తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఆడిటింగ్ లోపం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల మేనేజ్ మెంట్లు ఇచ్చిన రిపోర్టులను సరిగా చూడకపోవడంతో, పలు కాలేజీల్లో భారీగా ఫీజుల పెంపునకు టీఏఎఫ్ఆర్సీ అంగీకరించింది. దీంతో ఒక్కో కాలేజీలో రూ.10 వేల నుంచి రూ.30వేల దాకా ఫీజులు పెరిగినట్టు తెలుస్తోంది. చివరికి తప్పును గుర్తించి, కాలేజీల మేనేజ్ మెంట్లతో టీఏఎఫ్​ఆర్సీ మళ్లీ హియరింగ్ మొదలుపెట్టింది. ‘కాలేజీల్లో ఫీజుల ఖరారుపై ఉత్తుత్తి విచారణ’ పేరుతో జులై 20న టీఏఎఫ్ఆర్సీ హియరింగ్​ డొల్లతనాన్ని ‘వెలుగు’ బహిర్గతం చేసింది. రాష్ట్రంలో 157 ప్రైవేటు ఇంజినీరింగ్​ కాలేజీలుండగా, వాటిలో 2022– 25 బ్లాక్ పీరియడ్​కు ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. దీని కోసం టీఏఎఫ్ఆర్సీ మేలోనే ప్రాసెస్ మొదలుపెట్టింది. కాలేజీల ఆదాయ, వ్యయాలకు సంబంధించి మూడేండ్ల వివరాలను సేకరించింది. వీటిని టీఏఎఫ్ఆర్సీ ఆడిటర్లతో ఆడిట్ చేయించింది. వీటి ఆధారంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేశారు. అత్యధికంగా రూ.1.73 లక్షల ఫీజు ఉండగా, దాదాపు 40కి పైగా కాలేజీల్లో రూ.లక్ష ఫీజు ఉన్నట్టు సమాచారం. వీటిని టీఏఎఫ్ఆర్సీ అధికారులు సర్కారుకు పంపించినా, అధికారికంగా ఇంకా జీవో రాలేదు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేటు ఇంజినీరింగ్​ కాలేజీలో గత బ్లాక్​ పీరియడ్​ కంటే రూ.10 వేల వరకూ ఫీజు తగ్గడంతో, ఆ కాలేజీ ప్రతినిధులు రివ్యూకు వెళ్లారు. ఆ లెక్కలు చూడటంతో తప్పులు కనిపించాయి. పలు అంశాల్లో ఆన్​లైన్​లో ఓ లెక్క, ఫిజికల్ కాపీల్లో మరో లెక్క ఉండగా, ఆడిట్ చేసిన ఫైల్​లో ఇంకొ కొత్త లెక్క గుర్తించినట్టు తెలిసింది. దీంతో పలు కాలేజీలను చెక్​ చేయగా, 50 కాలేజీల్లో ఇలాంటి తప్పులు గుర్తించినట్టు సమాచారం.  

మళ్లీ హియరింగ్.. ఫీజుల తగ్గింపు!

ఆడిటింగ్​లో తప్పుల కారణంగా మళ్లీ ఆ కాలేజీలతో టీఏఎఫ్ఆర్సీ హియరింగ్ నిర్వహిస్తోంది. సోమ వారం 16 కాలేజీల మేనేజ్ మెంట్లతో భేటీ కాగా, మంగళవారం మరో 29 కాలేజీలతో హియరింగ్ నిర్వహిస్తున్నారు. మిగిలిన కాలేజీలకు తర్వాతి రోజు ఉంటుంది. సీబీఐటీకి గతంలో రూ.1.73లక్షల ఫీ జు ఖరారు కాగా, కొత్త ఆడిటింగ్​తో రూ.20 వేల నుంచి రూ.25 వేలు తగ్గే చాన్స్​ ఉన్నట్టు తెలిసింది.