మంచినీరు అనుకుని యాసిడ్​ తాగిండు

V6 Velugu Posted on Jul 26, 2021

చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి
జీడిమెట్ల, వెలుగు: యాసిడ్​ తాగి వృద్ధుడు మృతి చెందాడు.  జగద్గిరిగుట్ట  పరిధి ఎల్లమ్మ బండ పీజేఆర్​ కాలనీకి చెందిన ఉప్పల బాలయ్య (75)కు కొంతకాలంగా చేతులు, కాళ్లు సరిగా పనిచేయడం లేదు. శనివారం రాత్రి అతడు మంచం పక్కనే ఉన్న బాత్​రూమ్ ​శుభ్రపరిచే యాసిడ్​ను మంచినీరు అనుకుని తాగాడు. కొద్ది సేపటికి వాంతులు చేసుకోగా, కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు ఫైల్​ చేశారు.

Tagged man dies, mistake, , acid Drink

Latest Videos

Subscribe Now

More News