
బెంగళూరులో జాబ్ చేయడం వల్ల కలిగే ఒంటరితనం, భావోద్వేగం గురించి ఒక మహిళా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ (SDE) విచారం వ్యక్తం చేశారు. భారతదేశ టెక్నాలజీ హబ్లో పనిచేసిన అనుభవాన్ని చెప్పుకుంటూ ఆఫీసులో ఇంకా పేయింగ్ గెస్ట్ హాస్టల్లో ఒంటరిగా అయిపోతున్నానని అన్నారు.
బెంగళూరులో నేను దెయ్యంలా ఎందుకు భావిస్తున్నాను ? ఇది సాధారణమా? అనే పోస్ట్‌తో ఆమె తన బాధను వ్యక్తం చేశారు. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి, ఫుల్ టైం ఉద్యోగంలో చేరిన కూడా ఆమెని ఒంటరితనం వేధిస్తోందని చెప్పారు. తన ఫ్రెండ్స్ అందరు దూరంగా ఉంటున్నారని, కానీ ఒక ఫ్రెండ్ తనతో రోజు ఉండే అతను కూడా వేరే చోటికి మారడంతో మరింత ఒంటరినయ్యానని ఆమె తెలిపారు.
ఆమె పనిచేస్తున్న టీం మొత్తం పురుషులతో ఉండటం వల్ల, ఆమెను చిన్నచిన్న విషయాల్లో కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఉంటున్న పేయింగ్ గెస్ట్ (PG) హాస్టల్లో రూమ్మేట్స్ కూడా ఆమెతో మాట్లాడకపోవడం వల్ల ఏడ్చినా, నవ్వినా పట్టించుకునేవారు లేరని వాపోయారు.
►ALSO READ | IT News: TCS మరీ ఇంత దారుణమా.. హెచ్‌ఆర్ చేసిన పనికి టెక్కీ షాక్.. ఏడుపు కూడా..
ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో చాలామంది సోషల్ మీడియా యూజర్లకు స్పందించారు. కొందరు ఆమె అనుభవాన్ని షేర్ చేసుకుంటూ ఈ వయస్సులో ఇలాంటివి సాధారణమని అనగా, మరికొందరు ఆమెకు కొత్త కమ్యూనిటీలలో చేరమని, ఏదైనా హాబీలు అలవాటు చేసుకోమని సలహా ఇచ్చారు. ఇంకొకరు బెంగళూరులో డబ్బు సంపాదించి వరల్డ్ టూర్ చేయండి. మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోండి. మీరు ఎక్కడ ఉన్నా వర్క్ లైఫ్ ఒంటరిగానే ఉంటుంది అన్నారు.
ఇదే విషయం పై మరో ఘటన కూడా బెంగళూరు వాతావరణంపై చర్చకు దారితీసింది. ఇద్దరు దంపతులు బెంగళూరు వదిలి వెళ్తున్నట్లు చెప్పారు. బెంగళూరులో కాలుష్యం కారణంగా ఆరోగ్యం క్షీణిస్తోందని, గతంలో స్వచ్ఛమైన గాలి ఉండేదని కానీ ఇప్పుడు అది కరువైందని అన్నారు. ఫిబ్రవరిలో గాలి నాణ్యత సూచిక (AQI) 297కి చేరిందని, ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని కూడా ఆందోళన వ్యక్తం చేశారు.